Jan 25, 2011

జ్ఞాపకాలు

విడిపోయామని తెలుసు ,
వీడుకోలు చెప్పుకొన్నామని తెలుసు..
మనసు మందిరం లో ఏ మూలనో 'తలపులు' తలుపు తెరచి గుర్తుచేస్తున్నాయి
నీతో ఆ జ్ఞాపకాలను నేస్తం....
నలుగురిలొ వున్న , నీకై వెతికిన ఆ సమయాలు...
గమ్యం ఎరుగని నాకు , నీవు చూపిన ఆ దారులు .......
విజయం అందుకున్న వేళ , నీవు లేక వెలవెల బొయిన ఆ వేదికలు....
ప్రతి మలుపు లో నీవున్నావని , గెలుపు పొందిన క్షణాలు
నీతోనే అని చెప్పే సమయాన , నీ చిటికిన వేలును పంచుకుంటున్న        

ఆ వరుడిని చూసిన  సంధర్బాలను...     


ఇక లేవని తెలిసి ....... మనసు మూగగా రోదిస్తోంది
నాకోసం వేచే హృదయం వుందని సూచిస్తోంది........    

No comments: