Jul 20, 2011

గాలి పటం

అనుభవాల 'గాలి  పటం' ఎగిరిపొయింది
                       బంధాలు అనే  నులు బంధాన్ని తెంచుకుని ...  మరో లోకం అహ్వనించినట్టు
అమ్మని గుర్తు చేస్తు....
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక...... 

           చేయుత నిచ్చిన నులు బంధాన్ని  విడిపించుకుంటూ....
 గాలి వాటుతో పరుగు పెడుతూ ,    ఎగురుతూ,పడుతూలేస్తూ

              "జీవితం" అంటే...ఇదేనంటూ తెలుపుతూ 
తనతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు...

                             ఆనందంగా వీడ్కోలు చెబుతూ............
తనలో అనందాన్ని..తనతో భాదల్ని పంచుకుని 

క్రింద ఉన్న....ఆ సహచరులకు  వీడ్కోలు చెబుతూ , 
మరల వస్తా  అంటూ......  
                            ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.

వేచే హ్రుదయం

విడిపోయామని

వీడ్కోలు చెప్పుకున్నామని తెలుసు

మనసు మందిరంలొ మూలన 'తలుపులా

           తలుపులు తెరిచి

                      గుర్తుచేస్తున్నాయి ఆ ఘ్యాపకాలు నేస్తం..

నలుగురు లో ఉన్న

                      నీ కోసం వెతికిన ఆ సమయాలు..

గమ్యం ఎరుగని నాకు

                      నీవు చూపిన ఆ దారులు

విజయం అందుకున్న వేళ

          నీవు లేక వెలవెల బోయిన 

                     ఆ వేదికలు............

ప్రతి మలుపులో నీవున్నావని,

                     గెలుపు పొందిన క్షణాలు

నీతోనె అని చెప్పే సమయాన,

                     నీ చిటికిన వేలును పంచుకుంటున్న

ఆ వరుడి చూసిన సంధర్బాలును......

ఇక నా దానివి కావని  తెలిసి.... మనసు మూగ బోయింది....  

నాకోసం వేచే హ్రుదయం ఉందని సూచిస్తోంది....

 

Jul 14, 2011

మనిషిగా బ్రతుకు

ప్రాపంచీకరణ పరుగులో పరిగెడుతున్న   ఓ స్నేహితుడా  !         
పలకరింపులకు  హస్తభాషణాన్ని   ఆభరణంగా   మార్చుకున్న  ఓ పౌరుడా  !
మరచిపోయావా   
వర్షంలో ఆవరణలో కూర్చోని ఆస్వాదించిన తేనీరుని,       
పాలబుగ్గల పసిపాప  చిన్ని పాదాలను  ముద్దాడినపుడు పులకరించిన మనసుని  ,
తొలకరి జల్లులో ,   నీవాడిన   అట స్ఠలం  తడిసినపుడు   వచ్చే  మట్టి   వాసనను ,
బడికెళ్ళే      దారిలో నీవిసిరిన  రాళ్ళకు  పడిన రాగిపళ్ళ లెక్కను ,
బల్ల కట్టు పై నిల్చుని రెండు ప్రపంచాల మధ్య గా , నీ  జీవితం లా  సాగిపొయే గోదావరి అలలను  ,  
ప్రేయసి పలకరింపుల  కోసం క్షణాలను   యుగాలుగా గడిపిన చిన్ని క్షణాలను .   
భాధల    భారం   మోయలేకున్నప్పుడు    అమ్మ ఇచ్చిన     ఓదార్పును   ...
మరచిపొవద్దు  మిత్రమా!    
మనిషిగా బ్రతుకుతున్నామని  ....మర మనిషా  ఇంకా మారలేదని   .

Jan 25, 2011

జ్ఞాపకాలు

విడిపోయామని తెలుసు ,
వీడుకోలు చెప్పుకొన్నామని తెలుసు..
మనసు మందిరం లో ఏ మూలనో 'తలపులు' తలుపు తెరచి గుర్తుచేస్తున్నాయి
నీతో ఆ జ్ఞాపకాలను నేస్తం....
నలుగురిలొ వున్న , నీకై వెతికిన ఆ సమయాలు...
గమ్యం ఎరుగని నాకు , నీవు చూపిన ఆ దారులు .......
విజయం అందుకున్న వేళ , నీవు లేక వెలవెల బొయిన ఆ వేదికలు....
ప్రతి మలుపు లో నీవున్నావని , గెలుపు పొందిన క్షణాలు
నీతోనే అని చెప్పే సమయాన , నీ చిటికిన వేలును పంచుకుంటున్న        

ఆ వరుడిని చూసిన  సంధర్బాలను...     


ఇక లేవని తెలిసి ....... మనసు మూగగా రోదిస్తోంది
నాకోసం వేచే హృదయం వుందని సూచిస్తోంది........    

Jan 24, 2011

ప్రస్థానం

ప్రస్థానం 
ప్రతి మనిషీ జీవితం లో దానిదొ ప్రత్యేక స్థానం
పుట్టుక , చావుల మధ్య అడుగుల రాతతొ
రాసుకున్న పుస్తకం
తెరిచి చూసిన ప్రతి సారి తీరని అశలు, తెలియని అందాలు,
తట్టుకొలేని బాధలు , తెరమరుగైన కొన్ని బంధాలు
నాలుగు దశల జీవితం , నలుగురితో సావాసం
చివరికి మోసే అ నలుగురి కోసం ....
వేసే ప్రతి అడుగు నిర్వచిస్తుంది ని స్థానం
మహ ప్రస్థానమా ? మలిన ప్రస్థానమా ?