Jul 14, 2011

మనిషిగా బ్రతుకు

ప్రాపంచీకరణ పరుగులో పరిగెడుతున్న   ఓ స్నేహితుడా  !         
పలకరింపులకు  హస్తభాషణాన్ని   ఆభరణంగా   మార్చుకున్న  ఓ పౌరుడా  !
మరచిపోయావా   
వర్షంలో ఆవరణలో కూర్చోని ఆస్వాదించిన తేనీరుని,       
పాలబుగ్గల పసిపాప  చిన్ని పాదాలను  ముద్దాడినపుడు పులకరించిన మనసుని  ,
తొలకరి జల్లులో ,   నీవాడిన   అట స్ఠలం  తడిసినపుడు   వచ్చే  మట్టి   వాసనను ,
బడికెళ్ళే      దారిలో నీవిసిరిన  రాళ్ళకు  పడిన రాగిపళ్ళ లెక్కను ,
బల్ల కట్టు పై నిల్చుని రెండు ప్రపంచాల మధ్య గా , నీ  జీవితం లా  సాగిపొయే గోదావరి అలలను  ,  
ప్రేయసి పలకరింపుల  కోసం క్షణాలను   యుగాలుగా గడిపిన చిన్ని క్షణాలను .   
భాధల    భారం   మోయలేకున్నప్పుడు    అమ్మ ఇచ్చిన     ఓదార్పును   ...
మరచిపొవద్దు  మిత్రమా!    
మనిషిగా బ్రతుకుతున్నామని  ....మర మనిషా  ఇంకా మారలేదని   .

No comments: