Feb 18, 2008

మది లొని అమ్మాయి - ముందర లేని అమ్మాయి

నిను చూడనంతవరుకు అనుకున్న
నేను "ప్రేమ" కి లొంగని అపర చాణిక్య శపధుడనని
ప్రేమను భావించ
అది విభిన్న లింగ పాశ్వ కామ గౌరవ రూపమని
కాని
నిను గాంచిన నాడు
అనుకున్న అందమైన గగన గుడారం లో
అతి సున్నిత మైన మూర్ఖుడిని నేనెనని
కావ్యాలన్ని కదిపి చూసా
కనువిందు చేసే నీ రూప వర్ణ పదాల కోసం
వర్ణ చిత్రాన్ని గీసా నీ నా వర్ణ భావలని ఒడిసి పట్టడం కోసం
మధుర గానం కోసం ఎదురు చూసా నిను తలంచిన మస్థిష్క మరీచికల హొలీ కోసం
అందానికి హద్దులు చూసా
కానీ నిను చూసిన తరువాత అనుకున్న అది అత్యాశని
ప్రకౄతి తో అటగా అడిగా !
పరంధామునికీ ప్రశ్నగా వేసా?
చివరకు తెలిసింది
"నాలోని అణువుల అనూహ్య భావాల పుష్ప శోభిత ప్రేమామౄత లావణ్య రూపం నీవేనని"

No comments: