Mar 4, 2008

క్షమించమనడం తప్పా?

ఆమె స్వరం బరువెక్కినది
వేదనలతో నిండిన హౄదయంతో
కన్నీటి సంద్రం , తీరం దాటి
తన చెక్కిట వంపున జారి
హౄదయాన్ని తాకాయి.. అవి
వేదనల వేడిమి చల్లారుస్తున్నట్లు

కంటి పాప నిముసమైన కనురెప్ప
క్రింద దాగదాయె
కష్టాల కాటుక తనే ధరియించినట్లు
తాకితే స్పర్శే ఎరుగని తన చేతులు

శిలా రూపమయిపోయినవి
తన శిల్పాన్ని తనే కఠినంగా చెక్కుకున్నట్లు
అంతటి నా సుందరి వేదనను చూసి
ఉరకుండలేకపోయినాను,
ఉప్పెనై ఉప్పోంగాలనుకున్నాను
ఏమి చేయను
తన కన్నీటికి కారణమైన
"నా" కాఠిన్యకోపాన్ని, కరుణతో
క్షమించమనడం
తప్పా!

No comments: