Mar 15, 2008

జీవిత పట్టిక

"గీతాంజలి" వ్రాయలేను
రవీంద్రుని నవ గీతికనూహించి
"మహప్రస్థానం " సాగించలేను
మరో ప్రపంచాన్ని సౄష్టించి
"కౄష్ణపక్షం " చూడలేను
కౄష్ణ శాస్త్రి స్వప్నవిహంగాల రెక్కలనుంచి
"పుష్ప విలాపం " ఆపలేను
కరుణశ్రీ కారుణ్య హ్రుదయ అవేదనల రూపుగా మారి,
కాని
నేను వ్రాస్తున్న పల్లెపదాల పలకరింపులు
మరిచిపోయిన పాపడి "మన: పత్రిక"
మేడిపండు పట్టణాలలో మజిలీ చేయలేక
సొమ్మసిల్లిన వ్యర్ధుడు "శీర్షిక" గా
యద అంత బరువుతో ఎటు వెళ్ళాలో తెలియలేక సాగిపొయే
ఒక నడివయస్సు విధ్యాధికుడి "జీవిత పట్టిక"

No comments: