Mar 15, 2008

హేళన

వే వేల వర్ణాలు ఒక సొగసుకైన చాలవు
ఎన్నెన్నో అందాలు తన అందాన్ని మించబోవు ........(1)
మారాణి అభరణాలు బండెడైన చాలవు
తన ముక్కెర వంపునకు,
ముత్యాలన్నీ ముభావంగా చూస్తున్నాయి
తన మురిపెపు నవ్వుల దంతసిరి కోసం
కోటిరాగాలు కలత చెందుతున్నాయి తమని మరిపింప చేసే రాగం
తన స్వరంలో వుందని,
......(1)
పువ్వుల జతలు పొట్లాడుకుంటున్నాయి
తన శిరోజాలను ముద్దాడాలని
గొల్లభామలు గొల్లు మన్నారు తన చీరకట్టు
చాతుర్యం తమలో లేదని,
ఇన్ని అందాలు వున్న ఎదో తెలియని
అందం నన్ను ఆకట్టుకుంటుంది
అందుకోలేవని హేళన చేస్తున్నది.....

No comments: