Apr 3, 2008

మన:శిల్పం

మనసు గురించి చదువుతున్నావా నేస్తం
మరణించినాకైన అంతు చిక్కదు దాని నైజం

మాటలతో మురిసి ముస్తాబవుతుంది
ముభావంగా మారిపోతుంది అ మాటలకే

గుప్పెడంత మనస్సు
గాయాలకు అదంటే అలుసు

విధి ఆటలతో కఠిన శిలై పోతుంది
మానవీయం తో మనోహర రూపం గా మారిపోతుంది

చంచలమైనదని దానికి పేరు
చరిత్రలో నిలిచిపోయే "వ్యక్తి"త్వానికి తనే సరిజొడు

ఎడబాటును తట్టుకోలేదు
'అహం ' తో ఎవ్వరితోను సరిపెట్టుకోలేదు

మానవీయ/మానవత్వ కోణం దానికో రూపం
మారణహోమం దానికో శాపం

చెప్పు నేస్తం చెక్కగలవ అ మన:శిల్పాన్ని
చదువుకున్న లోకం తో
ఈ మా'నవ' లోకం కోసం...............

No comments: