Apr 3, 2008

ప్రేయసి? - భార్య?- స్నేహితురాలు?

అణువు అణువు న నీవె
ఆనందమగాదాలలో నీవె,
మాటలు రాని మాటలు లేని
మనోహరమైన మనస్సు న నీవె,
ఆశయ అంకురానికి
అడ్డంకుల అవరోహణకి స్ఫూర్తివి నీవె,
నింగిలోని తారాలకన్నా నేలమీద ధ్రువతారవు నీవె,
శ్వాసతో పలికే వేణువు కన్నా
నీ ప్రత్ శ్వాసతో పరుగిడే నా గుండె సవ్వడి నీవె,
సుఖ దుఃఖాల సాగరం లో
ఈదే నా మొప్పల శక్తివి నీవె,
నా ప్రతి పలుకు నీవె,
నాలో పగిలే అగ్ని పర్వతాలకు ఆద్యం నీవె,
నా జీవితంలోని పూర్వార్ధ ఉత్తారార్ధములతో
నిండి వున్నది నీవె,
నా ప్రగతికి బంధనం ప్రతి బంధనం నీవె,
కాని "నీవె" అనే భావనకి ప్రతిరూపం మాత్రం నెవరివో?

No comments: