Apr 3, 2008

భవిష్యత్ నావ

కాలాన్ని తిట్టుకున్న కలిసి రాని విధిని చూస్తూ,
సంద్రం ఆటుపోటులను విన్నా
అవి నాలో ఆవేదనల రూపమన్నాయి,
కంటిలోని కన్నీరు
నా ముందు ప్రపంచాన్ని తడిపేసింది
కాని
అవి నా భాధల భావుటాపై భారాన్ని తీర్చలేకున్నాయి
ముందు ప్రపంచాన్ని ఊహించుకున్నా
వర్తమానం అగాధం గా అనిపించింది.....
ఆనందం ఎక్కడా అనిపించింది
అవి గడిచిపోయిన మధుర జ్ణ్జాపకాల సంద్రం లో
భవిష్యత్ నావలో
నిరంతర సారధినైనప్పుడని తెలియవఛ్ఛింది

No comments: