Apr 21, 2008

అనుభూతుల దీపం

భానుని తాపంతో
వెన్నెల దీపాన్ని వెలిగించాను
ప్రకౄతితో దాని వన్నెల చిన్నులను చూడాలని,

సాగర అలలతో చందమామ"ల" ఆటలు
అందం గా కనిపించాయి అరుదుగా అనిపించాయి

తారలన్ని ముభావంగా ముడుచుకున్నాయి
మచ్చల చంద్రుడు మా కన్నా అందగాడాయని?

మేఘ కౌగిలులు మామను ముంచేసాయి
ఈ అందగాడు మా సొంతమనుకున్నాయి

పల్లెపడుచులు వెన్నెల పిల్లగాలితో ఆడుతున్నారు
తమలోని విరహవేదనను అవి తీరుస్తున్నట్లు,

కోనేటి హంసలు కొత్త రంగునలముకున్నాయి
కొంటే మామ తమ కోనేటి లో దాక్కొన్నట్లు,
తెలుసుకొన్నట్లు

ఇన్ని అనుభూతుల ఆ దీపాన్ని తాకాలని
నా హృదయం  రెక్కల కట్టుకుని
ఎగిరిపోయింది, ఎక్కడికోపోయింది.......

1 comment:

Bolloju Baba said...

బ్యూటిఫుల్
బొల్లోజు బాబా