Jun 12, 2008

అగ్రరాజ్యం

అరవై ఏళ్ళ ఘన స్వాతంత్ర్యం మనది
అర్ధాకలి తో మండుతోంది,ఇప్పటికి అవ్వ ఉదరనిధి
ధౄడరాజ్యాంగం మనది
అధౄడ పరిపాలనకు సన్నిధి,
భిన్న మతాల ఏకత్వం మనది
ఏకమతాధిపత్యానికి , " మారణహోమం " జరపనిదే ఆగదు మది
కవులు కళాకారులకు పుట్టినిల్లు
పరదేశ కవులకు కొట్టి పంపడం మనకే చెల్లు,
మహనుభావుల జ్ణ్జాన సంపద మన సొత్తు
జ్ణ్జానార్జనలో పరదేశియులకు మనమే తొత్తు,
అన్ని వున్న అడుక్కొనటమే మన నైజం
అణగారిన బ్రతుకులకు ఇదే నిదర్శనం
విలువలకు కొదవ లేదు
పాటించే ఓపిక తీరిక మనకు లేవు,
100 కోట్ల మందిని గల సామ్రాజ్యం
ఎప్పటికి అవుతుందో అగ్రరాజ్యం ,
ఎంత కాలం , "సహనం "
ఎక్కడికి పోతున్నం మనమందరం???

No comments: