Sep 26, 2008

విధి-వీధి బాలలు

పుట్టినది ఎక్కడో ఎరుగరు...
పుట్టించిన దేమునికి తప్ప...

సురీడు తోనే నిద్ర లేస్తారు...
సూర్యాస్తమయం వారికి లేదు.....

వీధి వీధి నా వాళ్ళే ఉంటారు...
విధి ఎలాంటిదో చెప్పకనే చెప్తారు....

బ్రతుకు భారం తీరుస్తుందంటూ ..
భుజాన భారం వేసుకుంటారు..

విలాసం వారికి తెలియదు...
విధి విలాసం తప్ప...

భుజాన నున్న సంచి నిండకుండా
కడుపు సంచి కొంచెమైనా నింపుకుందామంటే...
అయ్యెమంటాడో నన్న భయం...
ఆకలి తోనే జీవితాన్ని గడపమంటుంది ప్రతి ఉదయం

ప్రపంచం తో వారికి పని లేదు..
పనికి రాని వస్తువుల ప్రపంచంతో (చెత్తకుప్ప) తప్ప...

అనుక్షణం బ్రతుకు పోరాటం తప్ప...
అక్షరాలు వారి దరి చేరవు....లక్షలిచ్చి కొంటున్న చదువులతో

అందమైన బాల్యం వారికొ శాపం....
ప్రపంచం ప్రసాదించినది పైగా ..... "వీధి బాలల"నే నామం

3 comments:

Bolloju Baba said...

చాలా బాగుంది

పరిమళం said...

ఆదిత్య గారూ ! వీధిబాలల దయనీయ జీవితం మీ కవిత ద్వారా కళ్ళముందుంచారు . మనసు భారమైనదండీ ....నిజమే ...అందమైన బాల్యం వారికి శాపమే ...

karlapalem Hanumantha Rao said...

ఇంత చిన్న వయసులోనే సామాజిక చింతన వుంది మీకు.అభినందనలు .వీధి బాలల మీద మీ కవిత బాగుంది.