Apr 25, 2010

నేను


విశాల విశ్వం లో
చిన్న అణువును నేను
కోపాగ్ని హోమం లో
క్షణాన కనుమరుగైయె హవిస్సును నేను
అశాంతి ఆకాశం లో
స్వేఛ్ఛగా తిరుగాడే శాంతి కపోతాన్ని నేను
అవినీతి ఎడారిలో
నీతి ఊటబావిని నేను
మతాల మారణ హోమం లో
మౄత్యుమతాన కలిసే మనిషిని నేను
మానవత్వపు పూల తోట లో
సుమ పరిమళాలల్లిన చిన్ని పుష్పాన్ని నేను
అన్ని
భావాల రసాలను నేను
అన్న భావం తో
పలికించే మురళిధర "వే( )ణువు" ను నేను

No comments: